Public Talk on Pusha 2 : జాతర సీన్ కు జాతీయ అవార్డు గ్యారంటీ.. పబ్లిక్ టాక్
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు పుష్ప 2 ను ఎంజాయ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు ఒకే ఒక్కడు సినిమాను భుజాలపై మోశాడు. బన్నీ నటనతో ఆద్యంతం సినిమాను నిలబెట్టాడు అని చెప్పడంలో సందేహమే లేదు. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గంగమ్మ జాతర ఎపిసోడ్ కు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు అల్లు అర్జున్.
ఆ ఎపిసోడ్ లో బన్నీ నటనను చూసిన ఏవైరైనా చెప్పేది ఒకటే మాట అల్లు అర్జున్ కు మరోసారి జాతీయ అవార్డు రావడం గ్యారెంటీ అంటున్నారు. చీర కట్టుకుని గాజులు ధరించి నాట్యం చేస్తుంటే అల్లు అర్జున్ కు అమ్మవారు పూనారేమో అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారని అంటున్నారు. ఆ రేంజ్ లో అద్భుత నట విశ్వరూపం కనబరిచాడని చెబుతున్నారు. ఈ సినిమా కోసం బన్నీ పడిన పడిన కష్టం తెరపై క్లియర్ గా కనిపించిందనీ.. ప్రతి సీన్, ప్రతి షాట్ లో బన్నీ చేస్తున్నట్టు ఉండదని అంటున్నారు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ మనకళ్లకు కనిపించేలా నటించారని అంటున్నారు. పలు సీన్లలో యాక్షన్ కు జాతీయ అవార్డు రావడం ఖాయమని ఫ్యాన్స్, మూవీ లవర్స్ చెబుతున్నారు.