Jawan Trailer First Review : పైసా వసూల్ పక్కా అంటున్న రి'వ్యూయర్స్'

'జవాన్' ట్రైలర్ పై హిట్ టాక్.. రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలు;

Update: 2023-08-28 11:10 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం 'జవాన్' గ్రాండ్ రిలీజ్ కున్న క్రేజ్, అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సినిమా గురించిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా అవతరించేందుకు భారీ సంఖ్యలో థియేటర్‌లకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 'జవాన్' అధికారిక ట్రైలర్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా, పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌ను వీక్షించారు. దాన్ని పూర్తి 'పైసా వసూల్' అనుభవంగా సమీక్షించారు.

జవాన్ ట్రైలర్ ఫస్ట్ రియాక్షన్స్

ప్రీవ్యూ, మొదటి రెండు పాటలు 'జిందా బందా', 'చల్లెయా..' అభిమానులలో ఉత్సాహాన్ని కలిగించగా.. ట్రైలర్ కూడా రాబోయే రోజుల్లో సంచలనంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 27న కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'శతాబ్దపు ట్రైలర్'ని చూశానని చెప్తూ ఓ కథనాన్ని పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు అతను 'జవాన్' గురించి మాట్లాడుతున్నాడని ఊహించారు. రాణి ముఖర్జీతో సహా పలువురు పరిశ్రమలోని వ్యక్తులు కూడా 'జవాన్' ట్రైలర్‌ను వీక్షించారు. “గత రాత్రి RCE కార్యాలయంలో కొంతమంది ఎంపిక చేసిన పరిశ్రమలోని వ్యక్తులు (బహుశా రాణి ముఖర్జీ కూడా) ట్రైలర్‌ను వీక్షించారు. ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఎడిట్ చేయబడింది. బాలీవుడ్ లో ఈ తరహా మాస్ ట్రైలర్‌ను చివరిసారి ఎప్పుడు చూసిందనేది మాకు గుర్తు లేదు”అని వాళ్లు చెప్పినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ 6 విభిన్న రూపాల్లో కనిపిస్తారని కూడా నివేదిక జోడించింది.

సినీ విమర్శకుడు ఉమైర్ సంధు కూడా తన ట్విట్టర్ ఖాతాలో 'జవాన్' ట్రైలర్‌ను చూశానని వెల్లడించారు . ట్రైలర్‌ను సమీక్షిస్తూ.. “జవాన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని బాక్సాఫీస్ రికార్డులను ధ్వంసం చేస్తుంది. జవాన్ ట్రైలర్ పైసా వసూల్. భారతదేశంలో 700 కోట్లు పక్కా అని రాసుకువచ్చారు.

జవాన్ గురించి

ఇక షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొనే ప్రత్యేక పాత్రలో కనిపించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Tags:    

Similar News