Bigg Boss 5 Telugu: నువ్వు మొదటివారమే వెళ్లిపోతావనుకున్నారు: జెస్సీతో షన్నూ
Bigg Boss 5 Telugu: చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు 10వ వారానికి చేరుకుంది.;
Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు 10వ వారానికి చేరుకుంది. ఇక ప్రతీ వారం లాగా ఈ వారం ఎలిమినేషన్ నార్మల్‌గా జరగలేదు. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన తర్వాత చివరిగా డేంజర్ జోన్‌లో కాజల్, మానస్ మిగిలారు. బయట జరుగుతున్న సర్వేల ప్రకారం ఈసారి కాజల్‌కే తక్కవ ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఇక ప్రేక్షకులంతా కాజలే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
జెస్సీ.. గత వారం రోజులకు పైగా సీక్రెట్ రూమ్‌లోనే గడుపుతున్నాడు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ తనను హౌస్ నుండి బయటకు తీసుకువచ్చాడు. అప్పుడే తను ఎలిమినేట్ అయిపోయాడు అనుకున్నారంతా కానీ బిగ్ బాస్ తనను సీక్రెట్ రూమ్‌లోకి పంపి తనకు అవసరం అయినప్పుడల్లా డాక్టర్‌తో ట్రీట్‌మెంట్ ఇప్పించింది బిగ్ బాస్ టీమ్.
ముందు నుండే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న జెస్సీకి బిగ్ బాస్ వాతావరణం అంతగా సహకరించలేదు. అందుకే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉండేవాడు. అందుకే ఈ వారం సీక్రెట్ రూమ్‌కు వెళ్లిన తర్వాత దాదాపు జెస్సీనే తిరిగి ఇంటికి వెళ్లిపోతాడని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. చివరికి అదే జరిగింది.
జెస్సీ వెళ్లిపోతూ బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. ఒక్కొక్కరి గేమ్ గురించి తన అభిప్రాయాలను చెప్పాడు. పింకీ ఆటతీరుపై ఫైర్ అయ్యాడు. ఎన్నిరోజులు ఇలా త్యాగాలు చేస్తూ ఉంటావ్.. గేమ్ ఆడు అని సలహా ఇచ్చాడు. హౌస్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ షన్నూతో మాట్లాడుతూ జెస్సీ ఎమోషనల్ అయ్యాడు. నువ్వు మొదటివారానికే వెళ్లిపోతావనుకున్నారు అందరు పది వారాలు ఉన్నావ్ అని అన్నాడు షన్నూ.
సిరి, షన్నూ, జెస్సీ ఎంత క్లోజ్‌గా ఉండేవారో ప్రేక్షకులు చూశారు. అయితే సిరి కూడా జెస్సీ ఎలిమినేషన్‌ను తట్టుకోలేకపోయింది. అప్పుడు జెస్సీ తరువాతి వారమే బయటికి వచ్చేయకు. ఫైనల్ వరకు ఉండు అంటూ సిరితో మాట్లాడుతూ నవ్వించాడు. మరి నాకు కిస్సులు లేవా అని జెస్సీ అడిగిన ప్రశ్నకు సిరి.. ఫ్లైయింగ్ కిస్సెస్‌తో సిరి సమాధానం చెప్పింది. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని జెస్సీ.. బిగ్ బాస్ వల్ల చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు.