Jr. Ntr : ‘రాక్’లా మారబోతోన్న ఎన్టీఆర్

Update: 2025-03-10 10:00 GMT

ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఇది వందశాతం తృప్తిని ఇచ్చిన సినిమా కాదు అనేది అభిమానుల అభిప్రాయం కూడా. ఇక బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 తో అక్కడి ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం అంటున్నారు. ఆపై ప్రశాంత్ వర్మతో చేస్తోన్న డ్రాగన్ తన రేంజ్ ను మరో స్థాయికి తీసుకువెళుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ టైమ్ లో ఎన్టీఆర్ కోసం ఓ కొత్త టైటిల్ అంటూ ఓ టైటిల్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో కానీ.. టైటిల్ అయితే బానే ఉందని చెప్పాలి.

ప్రశాంత్ వర్మ తర్వాత తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించబోతోన్న ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గానే కన్ఫార్మ్ అయింది. అనిరుధ్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ చిత్రానికే ‘‘రాక్’’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు అనే టాక్ వినిపిస్తోంది. రాక్ అనేది ప్యాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుంది. అన్ని భాషలకూ ఈ టైటిల్ సెట్ అయిపోతుంది. అందుకే ఈ యూనిక్ టైటిల్ ను సెలెక్ట్ చేశారు అంటున్నారు. కాకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ న్యూస్ కన్ఫార్మ్ కావాల్సి ఉంది. త్వరలోనే మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రమోషన్స్ లో ఈ టైటిల్ నిజమా కాదా అనేది నాగవంశీ ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాడు. అప్పటి వరకూ ఈ రాక్ జస్ట్ రూమర్ గా మాత్రమే ఉంటుంది.

Tags:    

Similar News