సంక్రాంతికి వస్తున్నాం మూవీతోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ తర్వాత అతనికి స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది.ఫస్ట్ మూవీ పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకూ అన్నీ హిట్లే కొట్టినా ఇంకా తనను స్టార్ డైరెక్టర్ గా చూడటం లేదు అని ఆ మధ్య వాపోయాడు. బట్ సంక్రాంతికి మూవీ నుంచి ఈ ట్యాగ్ యాడ్ అయింది. దీనికి తోడు మెగాస్టార్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇది కూడా అనిల్ స్టైల్లోనే యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన కథ అని ఆల్రెడీ చెప్పాడు. 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పావులు కదుపుతున్నాడు అనిల్. ఇందుకోసం ఇప్పటి నుంచే దూకుడు మొదలుపెట్టాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందట. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు పాటలకు ట్యూన్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంచారట. ఈ మూవీకి కూడా
భీమ్స్ సిసిరోలియోనే రిపీట్ చేస్తున్నాడు. వీటిని మెగాస్టార్ ఓకే చేస్తే ప్రొసీడ్ అయిపోవడమే. ఈ సమ్మర్ లోనే షూటింగ్ స్టార్ట్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు అనిల్. అతని వర్కింగ్ స్టైల్ చాలా స్పీడ్ గా ఉంటుంది కదా. వెంకీ లాంటి స్టార్ హీరోతో కేవలం 80 రోజుల్లోపే సంక్రాంతికి వస్తున్నాం మూవీని పూర్తి చేశాడు. ఇక ఇప్పటికీ కెరీర్ ఆరంభంలో లాగా ఎర్లీ మార్నింగ్ షూటింగ్ అన్నా.. ఆ టైమ్ కు మేకప్ తో రెడీగా ఉంటాడు మెగాస్టార్. సో.. ఈయనతో వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. అంటే వీళ్లూ సంక్రాంతి బరిలో దిగడం ఖాయం అన్నమాట.