Dhanush : ధనుష్ ను డామినేట్ చేస్తోన్న జూనియర్ ధనుష్

Update: 2025-02-24 09:48 GMT

గత శుక్రవారం కోలీవుడ్ నుంచి విడుదలైన జాబిలమ్మ నీకు అంత కోపమా, డ్రాగన్.. రెండు సినిమాలూ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. రెండిటికీ హిట్ టాక్ వచ్చింది.తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ చిత్రాలకూ ఇక్కడా అదే టాక్ వచ్చింది.జాబిలమ్మ నీకు అంత కోపమాకు దర్శకుడు ధనుష్. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ను తనదైన కాంటెంపరరీ రైటిగ్ తో మెప్పించాడు ధనుష్. ఈ చిత్రంతో తన మేనల్లుడు పవిష్ ను హీరోగా పరిచయం చేశాడు.అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ ప్లస్ అయింది. స్టోరీ రొటీన అయినా స్క్రీన్ ప్లేతో అదరగొట్టాడు ధనుష్. ధనుష్ నుంచి ఈ రేంజ్ రైటింగ్ ను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు కూడా. అందుకే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఓ మై కడవులే అనే చిత్రంతో ఓవర్ నైట్ షైన్ అయిన అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన సినిమా రిటర్న్స్ ఆఫ్ డ్రాగన్. కోమాలితో దర్శకుడుగా లవ్ టుడేతో దర్శక హీరోగా ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాకూ సూపర్ హిట్ టాక్ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించారు. కాలేజ్ లో ఒక ప్రేమకథ, లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో మరో ప్రేమకథ అంటూ సాగినా.. ఈ మూవీలోని ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ ఆడియన్స్ ను కదిలించింది. హీరో క్యారెక్టరైజేషన్ లోని కన్నింగ్ నెస్ ను ఎంత ఎంజాయ్ చేస్తారో.. హానెస్టీని అంత బాగా ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు.ఈ కుర్రాడిని చూసిన ప్రతి ఒక్కరూ జూనియర్ ధనుష్ అని ప్రశంసిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ తో పాటు నటన కూడా అక్కడక్కడా ధనుష్ నే తలపిస్తుందంటున్నారు.

ఇక ఈ రెండు సినిమాలకూ సంబంధించి తెలుగులో జాబిలమ్మకు కాస్త ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి.డ్రాగన్ కు తగ్గించారు. బట్ కోలీవుల్ బాక్సాఫీస్ వద్ద మాత్రం డ్రాగన్ దూకుడుగా ఉంది. రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. థియేటర్స్ లో 100 పర్సెంట్ అటెండెన్స్ అంటూ పోస్టర్స్ వేస్తున్నారు. అలాగే కలెక్షన్స్ కూడా ధనుష్ మూవీ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాయి.మూడు రోజుల్లోనే ఈ డ్రాగన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 28.08 కోట్లు కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. ఇటు ధనుష్ మూవీ వరల్డ్ వైడ్ గా 17 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. పైగా చాలా చోట్ల డల్ అయిందని కూడా న్యూస్ వస్తున్నాయి. సో.. ధనుష్ మూవీపై జూనియర్ ధనుష్ మూవీ డామినేషన్ స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. మరి వీక్ డేస్ లో వీరి ప్రతాపం ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    

Similar News