jagadeka veerudu athiloka sundari : అదరగొట్టిన జగదేక వీరుడు

Update: 2025-05-10 10:30 GMT

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. 1990 మే 9న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అన్ని రికార్డులు బద్ధలు కొట్టి కొత్త రికార్డ్ లు సెట్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్స్ అనదగ్గ చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి ఖచ్చితంగా ఉంటుంది. మెగాస్టార్ మేనియా, శ్రీదేవి ఛరిష్మా, రాఘవేంద్రరావు దర్శకత్వ మహిమ, విన్సెంట్, కేఎస్ ప్రకష్ ల కెమెరా మాయాజాలం.. ఇళయరాజా మ్యూజికల్ వండర్స్.. వెరసి ఈ మూవీని ఎవర్ గ్రీన్ గా మార్చాయి. అశ్వనీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని మళ్లీ అదే డేట్ కు నిన్న రీ రిలీజ్ చేశారు.

జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ కోసం చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడున్న 4కే లో కాకుండా 8 కే లో అప్డేట్ చేయించారు. త్రీడీలోనూ మార్చారు. ఇన్ని హంగులతో ఉన్న మూవీ రీ రిలీజ్ అంటే చూడకుండా ఉంటారా. పైగా మెగా ఛరిష్మా ఇంకా తగ్గలేదు కదా. అందుకే ఈ మూవీకి ఓపెనింగ్ డే మంచి వసూళ్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా జగదేకవీరుడు అతిలోకసుందరి 1.75 కోట్లు వచ్చాయి. ఎన్నో యేళ్ల తర్వాత విడుదలైనా ఆ కలెక్షన్స్ అంటే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్ అనే చెప్పుకోవాలి. ఇక వీకెండ్ మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశాలున్నాయి. ఏదేమైనా జగదేకవీరుడు రీ రిలీజ్ లో కూడా అదరగొట్టాడు అనే చెప్పాలి.

Tags:    

Similar News