Kajal Agarwal: ఋతువులు మారతాయి.. నేను కూడా అలాగే..: కాజల్ అగర్వాల్

Kajal Agarwal: వైట్ టీషర్ట్, లెగ్గింగ్స్ ధరించి సోఫాలో కూర్చొని కాఫీ కప్పుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Update: 2022-02-02 09:52 GMT

Kajal Agarwal: టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.. తాను త్వరలో తల్లికాబోతున్న విషయాన్ని ఫోటోల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది ఈ చందమామ. తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లు తీసిన ఫోటో కావడంతో ఆ హ్యాపీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తోంది.

ఫోటోలో కాజల్ డెనిమ్ జాకెట్, వైట్ టీషర్ట్, లెగ్గింగ్స్ ధరించి సోఫాలో కూర్చొని కాఫీ కప్పుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అమ్మగా మారుతున్న ఆనవాళ్లు ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాస్త కవితాత్మంగా చెప్పుకొచ్చింది కాజల్.. ఋతువులు మారతాయి.. నేను కూడా అలాగే కొత్త ఆకుని అంటూ తన భర్త గౌతమ్‌ని ట్యాగ్ చేస్తూ రెడ్ హార్ట్ ఎమోజిని షేర్ చేసింది.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి 3 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. పలువురు సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా స్పందిస్తూ ఫోటోపై సోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News