Kalaavathi song : 'కళావతి' సరికొత్త రికార్డు..!
Kalaavathi song : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘సర్కారు వారి పాట’.
Kalaavathi song : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'సర్కారు వారి పాట'.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కి సూపర్ టాక్ వచ్చింది. లవర్స్ డే సందర్భంగా రిలీజైన కళావతి పాట రికార్డుల మోత మోగిస్తోంది.
ఈ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్స్ పైగా వ్యూస్‌ని సాధించి, రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ లో వెల్లడించింది. రిలీజైన ఫస్ట్ డే నుంచే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తూ వచ్చింది.
కాగా ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా తమన్ సంగీతం అందించాడు. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట 'పెన్నీ సాంగ్'సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై తెరకెక్కుతున్న ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.