Kaliyugam Pattanamlo : కలియుగంలో కల్పనమ్మగా బలగం నటి

‘కలియుగం పట్టణంలో’ నుంచి ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ రివీల్

Update: 2023-08-15 11:40 GMT

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో బలగంతో పాపులారిటీ తెచ్చుకున్న రూప లక్ష్మి పాత్రను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆమె కల్పనమ్మ పాత్రను చేయనున్నట్టు పోస్టర్ ను చూస్తేనే తెలుస్తోంది. ఆమె క్యారెక్టర్ ను డైరెక్ట్ గా చెప్పకపోయినా.. రూప లక్ష్మి చేతిలో ఉన్న 'కలియుగంలో అమ్మ కల్పనమ్మ' అనే పుస్తకమే ఆమె పాత్రను ఎలివేట్ చేస్తోంది.

ఇక ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తాజాగా రివీలైన ఈ పోస్టర్ లో రూప లక్ష్మి 'కలియుగంలో అమ్మ కల్పనమ్మ' అనే పుస్తకం చదువుతూ కనిపిస్తోంది. ఈ బుక్ పై ఉన్న టైటిల్ లో కల్పన అనే పేరును కొట్టివేసి, అమ్మ కల్పనమ్మ అనే పదాలను జోడించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను నాని మూవీ వర్క్స్‌ అండ్‌ రామా క్రియేషన్స్‌ పతాకంపై రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్‌ కె.చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్‌ లోగో పోస్టర్‌ను గత కొన్ని రోజుల క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా చేతుల మీదుగా విడుదల చేశారు.

‘డబ్బుల గురించి నేను ఆలోచించలేదు.. డబ్బులు సంపాదించడానికి ఈ సినిమాను నిర్మించలేదు. మన కడప జిల్లాకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాను. ఇండస్ట్రీలోకి రావటం మా అమ్మకు ఇష్టం లేదు. సక్సెస్ కొట్టి మా అమ్మకి చూపించాలి అనుకున్నాను. ఆడిషన్స్‌ను ఉపయోగించుకుని సినిమాలో నటించబోతోన్న వారందరికీ మంచి భవిష్యత్తు ఉండబోతోంది. స్టూడెంట్స్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే మళ్లీ ఆడిషన్స్ పెడతాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండ’ని నాని టైటిల్ లోగో లాంఛ్ లోనే చెప్పాకు. ఇకపోతే ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.



Tags:    

Similar News