Kaliyugam Pattanamlo : హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ‘కలియుగం పట్టణంలో’

ఒకే షెడ్యూల్‌లో ‘కలియుగం పట్టణంలో’ పూర్తి చేయనున్న మేకర్స్

Update: 2023-08-19 12:27 GMT

రోజుకో అప్ డేట్ తో వస్తోన్న ‘కలియుగం పట్టణంలో’ మూవీ తాజాగా మరో కొత్త వార్తతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ మూవీ రాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్‌లో పూర్తి చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం.

ఈ సినిమా కోసం నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో మొత్తం తారాగణం అంతా పాల్గొంటోంది. సెట్‌లో సందడి వాతావరణం కనిపిస్తోందని, అంతా పాజిటివ్ ఎనర్జీ ఉందని మేకర్లు కూడా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు శర వేగంగా సినిమాను పూర్తి చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు.

‘కలియుగం పట్టణంలో’ సినిమాలో బలగం ఫేమ్ రూప లక్ష్మి నటించబోతుందంటూ ఇటీవలే ప్రకటించిన మేకర్స్.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కలియుగంలో అమ్మ కల్పన అనే పుస్తకం చదువుతున్నట్టుగా ఉన్న పోస్టర్.. మూవీపై మరింత క్యూరియాసిటీని రేకెత్తించింది. కాగా ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.


Tags:    

Similar News