లోక నాయకుడు కమల్ హాసన్ చివరి సినిమా కల్కి 2 అవుతుందా అంటే అవుననే అంటున్నారు. కల్కి చిత్రంలో ఆయన పార్ట్ అవడమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఫస్ట్ పార్ట్ లో చిన్న పాత్ర. సెకండ్ పార్ట్ లో మాత్రం ఆయన పాత్రే కీలకంగా ఉండబోతోంది. ప్రభాస్ తో తలపడేది ఆయనే అనే హింట్ కూడా వచ్చింది ఫస్ట్ పార్ట్ లో. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అవి పూర్తయినా ప్రభాస్ డేట్స్ దొరకడం అంత సులువేం కాదు. అంచేత ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది నాగ్ అశ్విన్ కూడా చెప్పలేడు.
ఇక కల్కి 2తో కమల్ హాసన్ బయటి బ్యానర్ లో నటించడం ఆపేస్తాడట. అంటే బయటి బ్యానర్ లో చేసే చివరి సినిమా కల్కి2. రాబోయే రోజుల్లో ఎన్ని సినిమాలు చేసినా అన్నీ తన సొంత బ్యానర్ లోనే నిర్మించుకుంటాడట. ఆ మేరకు అఫీషియల్ గా చెప్పలేదు కానీ.. ఇదే క్లియర్ అంటున్నారు. మరి కమల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కానీ.. ఇక ఆయన్ని మా బ్యానర్ లో నటించమని ఇంకెవరూ అడగలేరు. ఒకవేళ చేసినా అందులో కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ ఇన్వాల్వ్ అవుతుంది. అదీ మేటర్.