Kalyan Ram : మరో ఇరవై ఏళ్లు గుర్తుండిపోయే సినిమా చేస్తున్నా : కళ్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్. విజయశాంతి నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచింది. టీజర్తోనే సినిమా బిజినెస్ క్లోజ్ కావడం విశేషం. కల్యాణ్ రామ్ కెరీర్లో భారీ ప్రిరిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. విజయశాంతి ఐపీఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా నాయాల్ది పాటను నరసరావుపేటలోని రవి కళామందిర్ లో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు.
నాయల్దీ పాటని కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ మధ్య అనుబంధాన్ని చూపించింది. అజనీష్ లోక్నాథ్ స్వరపరిచారు. రఘురామ్ సాహిత్యం అందించారు. పాట విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ప్రతి సారి మీ మన్ననలను పొందడానికి ప్రయత్నిస్తుంటాను. అతనొక్కడే సినిమాలాగా ఈ సినిమా కూడా మరో ఇరవై ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్ర చేసిన విజయశాంతిగారి ఆ క్యారెక్టర్ ని ఒప్పుకోవడం వల్ల ఈ సినిమా చేయడం జరిగింది. అమ్మలని గౌరవించడం మన బాధ్యత, వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఈ సినిమాని అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం అన్నారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ నందమూరి అభిమానులు కల్యాణ్ రామ్ గారిని ఎలా చూడాలని కోరుకుంటారో ఆ విధంగా ఈ సినిమాలో ఉంటారు. పలా పౌరుషం పాత్రలో కనిపిస్తుంది అని చెప్పారు. నిర్మాత అశోక్ వర్ధన్ ముప్ప మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రాణం కల్యాణ్ రామ్ మమ్మల్ని ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. అనిచెప్పారు. ఇంకా చదలవాడ ఆదిత్యః బృందానికి అభినందనలు తెలిపారు.