Kalyan Ram : అనిల్ రావిపూడితో కళ్యాణ్ రామ్

Update: 2025-04-03 07:45 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్. ఈ సమ్మర్ లోనే విడుదల కాబోతోన్న ఈ మూవీపై కళ్యాణ్ రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరీర్ లో ఇదో బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. విజయశాంతి కూడా సరిలేరు నీకెవ్వరు తర్వాత తనకు ఇది స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతుందనుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా విడుదల చేసిన పాట ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ వేసవిలోనే విడుదల కాబోతోన్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ప్రమోషన్స్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇందుకోసం ఓ మంచి ఐడియాతో ముందుకు రాబోతోంది టీమ్. తన మూవీతోనే దర్శకుడుగా పరిచయమైన అనిల్ రావిపూడితో ఓ కామన్ ఇంటర్వ్యూ చేయించబోతున్నారట. ఈ ఇంటర్వ్యూలో విజయశాంతి కూడా ఉంటుంది. చాలా కాలంగా చాలామంది దర్శకులు ప్రయత్నించినా విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు. బట్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కోసం ఒప్పించాడు. ఇటు తనకు దర్శకుడుగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్. అందుకే అనిల్ కూడా ఈ ఇంటర్వ్యూ చేసేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ఎలా చూసినా ఈ ప్లాన్ ఓ మంచి ఐడియా అనే చెప్పాలి. ఖచ్చితంగా మూవీకి ప్రమోషనల్ గా ఒక బెస్ట్ ఇంటర్వ్యూ అవుతుందనుకోవచ్చు. 

Tags:    

Similar News