Kangana Ranaut : అబూ సలేంతో భేటీపై కంగనా క్లారిటీ

గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో సమావేశంపై స్పందించిన కంగనా రనౌత్;

Update: 2023-10-01 06:34 GMT

కంగనా రనౌత్ కాంట్రవర్శియల్ ఇన్సిడెంట్స్, వ్యాఖ్యలు చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఆమె సినిమాల ద్వారా లేదా వ్యక్తిగత జీవితం ద్వారా ఏదో ఒక విషయంపై ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి కంగనా వైరల్ అవుతోంది. కారణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఓ ఫొటోనే.

ఈ ఫొటోను కాంగ్రెస్ మద్దతుదారు అని చెప్పుకునే ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. "కంగనా విత్ మియా" అనే క్యాప్షన్ తో ఈ ఫొటో షేర్ అయింది. దీనిపై తాజాగా స్పందించిన కంగనా.. యూజర్ ను దూషించింది. గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో ఆమె సమావేశం అయ్యారన్న వార్తలను క్లియర్ చేసింది. "అతను ముంబై బార్‌లో నాతో మామూలుగా తిరుగుతున్న భయంకరమైన గ్యాంగ్‌స్టర్ అబూ సలేం అని కాంగ్రెస్ ప్రజలు నిజంగా అనుకుంటున్నారని నేను నమ్మడం లేదు. అతను మాజీ TOI ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్ అతని పేరు మార్క్ మాన్యువల్" అని ఆమె స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, కంగనా రనౌత్ మూడవ తమిళ చిత్రం 'చంద్రముఖి 2' సెప్టెంబర్ 28న వెండితెరపైకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. పి వాసు దర్శకత్వం వహించిన ఈ హర్రర్-కామెడీలో రాఘవ లారెన్స్ కూడా నటించారు. ఈ చిత్రం తొలి శనివారం టోటల్‌గా రూ.17.60 కోట్లు వసూలు చేసింది.

కంగనా రనౌత్ ఆ తర్వాత 'తేజస్' సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం టీజర్ గాంధీ జయంతి రోజున విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. ఆమె తన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం 'ఎమర్జెన్సీ' కోసం తదుపరి సన్నాహాలు చేయనుంది. కంగనా రనౌత్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ , శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. దివంగత నటుడు సతీష్ కౌశిక్ చివరి చిత్రం కూడా ఇదే. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో రనౌత్ నటించనున్నారు.


Tags:    

Similar News