సూర్య హీరోగా నటించిన సినిమా కంగువా. దిశా పటానీ హీరోయిన్. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. సూర్య కెరీర్ లో నే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వాటిని రీచ్ అయితే సూర్య కూడా ప్యాన్ ఇండియా హీరోగా మారిపోతాడు. ఇప్పటితే అతనికి కంట్రీ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్ బేస్ డబుల్ అవుతుంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఫైర్ అనే సాంగ్ ను విడుదల చేశారు. బట్ ఈ సాంగ్ లో అంత ఫైర్ కనిపించడం లేదు. దేవీ మ్యూజిక్ కూడా ఎక్కడో విన్నట్టుగానే ఉంది తప్ప.. ఫ్రెష్ అన్న ఫీలింగ్ రావడం లేదు అనేది అంతా చెబుతోన్న మాట. ఇంకా చెబితే బాలీవుడ్ పద్మావత్ లోని ఓ పాటనుంచి ఇన్ స్పైర్ అయినట్టుగాఉందంటున్నారు.
తెలుగులో ఈ పాటను శ్రీ మణి రాశాడు. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ కలిసి పాడారు. కంగువ పై ఉన్న అంచనాలతో కంపేర్ చేస్తే ఈ పాట తేలిపోయిందనే చెప్పాలి. సాహిత్య పరంగా కూడా ఏమంత గొప్పగా లేదు. ఇండియన్స్ ప్రపంచానికి చాలా ముందున్నారు అని చెప్పే ప్రయత్నం ఈ పాటలో కనిపించింది. ఏదేమైనా ఫైర్ సాంగ్ అంటూ తెగ ఊరించిన టీమ్ ఈ పాటలో ఫైర్ లేదనే కమెంట్స్ ఫేస్ చేస్తోంది.