తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ 2025 పోటీలో నిలిచిన సినిమాల లిస్ట్ రిలీజవగా ఇందులో ‘కంగువా’ చోటు దక్కించుకుంది. దీంతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఇక నామినేషన్ల కోసం ఓటింగ్ రేపు(జనవరి 8) ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్‌లను జనవరి 17న ప్రకటిస్తుంది. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ 2025 వేడుక 2025 మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.