టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న ఒక్కో అప్ డేట్, ప్రే క్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈమూవీని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా, ఎం.మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, ఈ సమయంలో ఈ మూవీ టీమ్కు ఊహించని షాక్ తగిలింది. ‘కన్నప్ప' చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మాయం అయినట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల పైన కేసు నమోదు చేశారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.