మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ నుంచి 'మహదేవ శాస్త్రి' పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఆయన ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంద ని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. సినిమా షూటింగ్ నుంచి నిత్యం వివాదాల్లో, వార్తల్లో నిలుస్తూనే ఉంది. శివయ్య సాంగ్ రిలీజ్ అయిన ప్పుడు మాత్రమే కాదు.. లవ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా విమర్శలు వచ్చాయి. వీటికి తోడు పార్వతి పాత్రలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ కు బొట్టు లేదనే విమర్శలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. వీటన్నింటి పై మంచు విష్ణు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. కన్నప్ప సినిమా 2 వ శతాబ్దం నాటిదని, వారు ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయి.. అప్పటి పరిసరాలు అన్నింటిని క్లుప్తంగా తెలుసుకొనే ఈ సినిమా తీస్తున్నామని చెబుతున్నాడు విష్ణు. మహదేవశాస్త్రి పాత్ర ఎంట్రీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.