Karthikeya 2: 'కార్తికేయ 2'కు కలిసొచ్చిన రోజులు.. బాలీవుడ్‌లోనూ సెన్సేషన్
Karthikeya 2: ఏ స్టార్ హీరోకీ రానంత ఇమేజ్ ఈ రోజు ఈ యంగ్ హీరోకి వచ్చింది. ఇవాళ బాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ.;
Karthikeya 2: ఏ స్టార్ హీరోకీ రానంత ఇమేజ్ ఈ రోజు ఈ యంగ్ హీరోకి వచ్చింది. ఇవాళ బాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ.బాలీవుడ్ సినిమాలు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సుమారు మూడు వేల షోలు ప్రదర్శితం కానుండగా, కార్తికేయ 2 అంతకు మించి 3130 షోలు ప్రదర్శించనున్నారు.
సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు సౌత్‌లోనే కాక అటు నార్త్‌లోనూ రికార్డు క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ఇది. తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం యూఎస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది.
హిందీ వెర్షన్‌లో 50 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం రోజు రోజుకీ కౌంట్ పెరుగుతూ ప్రస్తుతం 3130 షోలకు వచ్చింది. విడుదలైన రోజునుంచి అక్కడ దుమ్మురేపుతోంది. నిన్నంతా ట్విట్టర్‌లో కార్తికేయ 2నే ట్రెండింగ్ నడిచింది. మూడు రోజుల్లోనే టార్గెట్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టిన సినిమా కార్తికేయ 2. ఈ ఏడాది క్లీన్ హిట్ అయిన సినిమాల్లో 11వ సినిమాగా ఉంది కార్తికేయ 2.