Kayadu Lohar : ఒక్క హిట్టుకు అరడజను ఆఫర్స్ వచ్చాయి..

Update: 2025-03-10 06:30 GMT

గుమ్మడికాయంత టాలెంట్ కాదు.. ఆవగింజంత అదృష్టం ఉండాలి సినిమా పరిశ్రమలో అంటారు. అది నిజమే అని నిరూపిస్తోందీ బ్యూటీ. రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ మూవీతో తన హొయలతో యూత్ ను ఫిదా చేసిన బ్యూటీ కయాడు లోహర్ ఇప్పుడు ఆఫర్స్ జడివానలో తడిసిపోతోంది. అంతకు ముందు నుంచే హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తోంది. కానీ హిట్స్ లేవు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ట్రై చేసిందీ అస్సాం సోయగం. బట్ డ్రాగన్ హిట్ కావడంతో ఇప్పుడు ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి.

డ్రాగన్ తో పాటు తను ఒప్పుకున్న మళయాల మూవీ నిలవరుమ్ వేలై అనే సినిమాలో కాళిదాస్ సరసన నటిస్తోంది. తమిళ్ లో ఒకప్పుడు యూత్ స్టార్ గా వెలిగిన మురళి తనయుడు అథర్వ మురళి(గద్దల కొండ గణేష్ లో నటించాడు)సరసన 'ఇదయం మురళి' అనే మూవీ చేస్తోంది.ఈ మూవీ ఓపెనింగ్ టైమ్ లోనే రిలీజ్ చేసిన వీడియోతో ప్రామిసింగ్ అనిపించుకుంది. పైగా ఈ టైటిల్ అథర్వ తండ్రికి ఆభరణం లాంటిది. అందుకే గ్యారెంటీ హిట్ అంటున్నారు. తెలుగులో విశ్వక్ సేన్ సరసన 'సితార' బ్యానర్ లో ఫంకీ అనే సినిమాకు రీసెంట్ గానే సైన్ చేసింది. అలాగే మాస్ మహారాజ్ తో అనార్కలి అనే సినిమా టాక్స్ లో ఉంది. అటు మళయాలంలో ప్రేమమ్ స్టార్ నివిన్ పాలీ సరసన తారమ్ అనే ప్రాజెక్ట్ కు కమిట్ అయింది. ఇలా చేతిలో ఇప్పుటికే 6 సినిమాలు పడ్డాయి. ఇవి కాక కోలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో మూవీకి సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నాయట. యాక్టింగ్ టాలెంట్ ఎలా ఉన్నా.. అమ్మడి గ్లామర్ కు అన్ని పరిశ్రమలూ ఫిదా అయిపోతున్నాయి. ఇక ఆ నటన కూడా చూపించేస్తే రాబోయే రోజుల్లో ఏదో ఒక పరిశ్రమలో టాప్ లేపే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి.

Tags:    

Similar News