రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కాంబోలో తెరకెక్కనున్న ‘రౌడీ జనార్దన్’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తొలుత కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ను ఈ పాత్ర కోసం పరిగణించగా వివిధ కారణాలతో ఒప్పందం కుదరలేదని పేర్కొన్నాయి. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎక్కువగా గోదావరి మాండలికంలోనే మాట్లాడేలా కథ రూపొందినట్లు వెల్లడించాయి. రెమ్యూనరేషన్ కూడా కీర్తి సురేష్ అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమా మొత్తం గోదావరి మాండలికంలో.. ఉండే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తేరీ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ఉప్పుకప్పురంబు పేరుతో కీర్తి సురేష్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో సుహాస్ ఓ కీలక పాత్ర చేస్తోన్నాడు.2023లో వచ్చిన దసరా, భోళాశంకర్ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కీర్తి. ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.