Keerthy Suresh : మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తి సురేష్‌ పెళ్లి

Update: 2024-11-16 05:36 GMT

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే గత రెండేళ్లుగా కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమించుకుంటున్నారట. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి అనేక ప్రైవేట్ పార్టీలు, వెకేషన్స్ కు వెళ్లారని టాక్. ఇక ఈ వార్తలపై కీర్తి సురేష్ వివరణ ఇచ్చింది. "సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూసి మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. నేను అనిరుద్‌తో ప్రేమలో లేను, అతినికి నాకు పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది పూర్తిగా ఫేక్. నాకు అనిరుద్ మంచి స్నేహితుడు, అది మాత్రం ఒప్పుకుంటాను. ప్రస్తుతం నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. నా దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా నెట్టింట ప్రచారమైన రూమర్స్‌కి చెక్ పడినట్లు అయింది.

Tags:    

Similar News