Keerthy Suresh : కొలంబోలో కీర్తి.. ఫొటోలు వైరల్!

Update: 2025-03-19 07:00 GMT

పైలట్ సినిమాతో 2000 సంవత్సరంలో బాల్యనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ కీర్తి సురేశ్. 2013లో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారం భించిందీ మలయాళ భామ. తర్వాత నేను శైలజ, నేను లోకల్ అజ్ఞాత వాసి సినిమాల్లో యాక్ట్ చేసింది. తర్వాత ఆమె నటించిన మహానటి సినిమా కెరీర్ ను మలుపు తిప్పింది. మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా లో ఆమె అద్భుతంగా నటించింది. ఇటీవలే బేబీ జాన్ చిత్రంలో కనిపించింది. ఇది 2024లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్. కలీస్ ఈ చిత్రా నికి దర్శకత్వం వహించారు. ఇది తమిళ చిత్రం థెరికి రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. బేబీ జాన్ సినిమాతో కీర్తి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో నటి స్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోందీ భామ. తన ఇన్ స్టా గ్రాం ఖాతాలో కొలంబోలో దిగిన ఫొటోలను ఇవాళ పోస్ట్ చేసింది. ఆమె బంగారు ఎం బ్రాయిడరీతో ముదురు ఆకుపచ్చ రంగు డ్రెస్ వేసుకుంది. స్టైలిష్ బ్లేజర్, మడతల డ్రేప్ ఉన్నాయి. ఆమె జుట్టును సొగసైన పోనీటైల్లో కట్టుకుంది. "ఆయుబోవాన్ కొలంబో, మీరు చాలా వైబ్" అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Tags:    

Similar News