Keerthy Suresh : అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన మహానటి

Update: 2024-08-06 13:15 GMT

దసరా సినిమాకు అవార్డు దక్కడంతో పండగ చేసుకుంటోంది ఆ మూవీ టీం. అయితే నిన్న జరిగిన శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు మహానటి ఫేమ్ కీర్తీ సురేశ్ ( Keerthy Suresh ) తయారై వచ్చిన తీరు నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.. తన పాత్రల్లో ఎప్పుడైనా కొంచెం గ్లామర్ టచ్ ఉన్నా.. అది హద్దులు దాటేది కాదు. క్లీవేజ్ షోలకు ఆమె పూర్తిగా దూరంగా ఉండేది. కానీ ఈ మధ్య కీర్తీ మేకోవర్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. గ్లామర్ హీరోయిన్లలో ఎవ్వరికీ తాను తీసిపోనని చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన సినిమా చేస్తుండడంతో అక్కడి స్టైల్కు తగ్గట్లుగా రెడీ అవుతోంది. రెండు మూడేళ్లు వెనక్కి వెళ్తే.. కీర్తీని ఇలాంటి లుక్ చూస్తామన్న ఊహ కూడా ఎవరికీ ఉండేది కాదు. కెరీర్ ముందుకు సాగేకొద్దీ ఎలాంటి హీరోయిన్ అయినా గ్లామర్ కనిపించేందుకు ట్రై చేయాల్సిందే. ఈ ఫంక్షన్ లో ఫ్లాష్ బ్యాకన్ను గుర్తు చేసుకొందీ ముద్దుగుమ్మ. తన లైఫ్ ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన మీడియాతో షేర్ చేసుకుంది. ' నా ఫ్యాన్ ఒకరు ఒక రోజు డైరెక్ట్ మా ఇంటికి వచ్చారు. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నడు. అతడి తీరు చూసి నేను షాక్ అయ్యాను' అంటుముసి ముసిగా నవ్వుకుంది.

Tags:    

Similar News