khushboo Patani: పార్టీలో హీరోయిన్ అక్క రచ్చ.. వైరల్ గా మారిన వీడియో..!
khushboo Patani: వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నటి దిశాపటానీ.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.;
khushboo Patani: వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది నటి దిశాపటానీ.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఆమెకు సోదరి ఖుష్బూ పటానీ అన్న సంగతి అందరికీ తెలిసిందే.
అమె సినీరగంలో లేనప్పటికి సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమెకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న(మంగళవారం) దిశ సోదరి ఖుష్బూ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ పార్టీలో ఖుష్బూ పాటనీ చేసిన డాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పార్టీలో టెబుల్ పైకి ఎక్కి మరి ఖుష్బు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోని దిశాపటానీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మై క్రేజీ సిస్, నీలా నేను కూడా డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నా అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కొందరు బాగా డాన్స్ చేశావ్ అని కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం తనో ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మరించిందా.. తనేమి హీరోయిన్ కాదు.. కొంచం పద్దతిగా ఉంటే మంచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.