Kiara Advani : బిడ్డ పుట్టాక నా జీవితమే మారిపోయింది: కియారా అద్వానీ

Update: 2025-08-12 11:45 GMT

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక పర్సనల్ లైఫ్ కోల్పోతున్న నటీమణులు. బిడ్డలకు జన్మనిచ్చాక ఆ ఫీలింగ్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీపికా పదుకొణె, అలియాభట్ విషయంలో అదే జరింది. ఈ ఇద్దరు భామలు కొద్దిరో జుల పాటు నటనకు దూరంగా ఉన్నారు. తాజాగా కియారా అద్వానీ కూడా తన బిడ్డే తన ప్రపంచం అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా జులైలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తోంది కియారా. బిడ్డ పుట్టాక తన జీవితమే మారిపోయిందంటోంది. 'నేను నీ డైపర్లు మారుస్తున్నాను. నువ్వేమో నా ప్రపం చాన్నే మార్చేశావ్.. ఈ డీల్ చాలా బావుంది' అంటూ ఓ కొటేషన్ ఉన్న ఫొటోని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేయడమే కాకుండా హ్యాండ్స్ తో హార్ట్ సింబల్, కళ్లలో నీళ్లు తిరిగే ఎమోజీలను షేర్ చేసింది. షేర్షా సినిమా టైమ్ లో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారగా 2023లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కట య్యారు. మ్యారేజ్ అయ్యిన రెండేళ్లకి రీసెంట్ గా వారికి ఓ పాప పుట్టింది.

Tags:    

Similar News