King of Kotha OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తోంది... ఎప్పుడు, ఎక్కడంటే..
ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైన 'కింగ్ ఆఫ్ కోత్త';
దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ గా రిలీజైన 'కింగ్ ఆఫ్ కొత్త' హిందీలో ఓటీటీలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. సినీ విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ మూవీ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లు సెప్టెంబర్ 29న ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్‌స్టార్ దీని హిందీ డబ్బింగ్ విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి ప్రీమియర్ కానున్నట్టు వెల్లడించింది.
ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటు ''ఒకరికి గూండా మరొకరికి రాజు'' అనే క్యాప్షన్ తో కింగ్ ఆఫ్ కొత్త మూవీకి సంబంధించిన ట్రైలర్ ను కూడా పంచుకుంది.
'కింగ్ ఆఫ్ కొత్త' గురించి
దుల్కర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్ జోస్, షమ్మి తిలకన్, శరణ్, శాంతి కృష్ణ, అనీఖా సురేంద్రన్ కూడా నటించారు. తన ముఠా, చట్టవిరుద్ధ కార్యకలాపాలతో పట్టణాన్ని పాలించే కన్నన్ భాయ్ అని పిలువబడే కన్నన్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది.
ఈ చిత్రం న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్‌లో ట్రైలర్‌ను ప్లే చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా దుల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హార్ట్ ఫెల్ట్ నోట్ ను కూడా రాసుకువచ్చాడు. ఈ చిత్రం విడుదలకు ముందు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.
''నా ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాను. న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్‌లో ట్రైలర్‌ను ప్లే చేసిన మొదటి మలయాళ చిత్రంగా “కింగ్ ఆఫ్ కొత్త” నిలిచింది. ఎప్పుడూ బిజీగా, ఉత్సాహంగా ఉండే టైమ్స్ స్క్వేర్‌ని చాలాసార్లు సందర్శించాను. కానీ అక్కడ స్క్రీన్‌లపై తన సినిమా కనిపిస్తుందని కలలో కూడా అనుకోలేదు. వ్యక్తిగతంగా నాకు ఇది గొప్ప క్షణం. మలయాళ సినిమాకు మనం ఇచ్చే అతిపెద్ద నివాళి ఇదే'' అని దుల్కర్ సల్మాన్ ఈ నోట్ లో తెలిపారు.
A goon for one is a King for another 👑#KingOfKotha streaming from 20th October in Hindi. pic.twitter.com/rZcZQQJoA7
— Disney+ Hotstar (@DisneyPlusHS) October 14, 2023