Vijay Devarkaonda : ఫస్ట్ సాంగ్ తోనే హైప్ మొదలైంది

Update: 2025-05-03 08:30 GMT

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతోన్న కింగ్ డమ్ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు అతని ఆర్ఆర్ చాలా పెద్ద ఎసెట్ గా నిలిచింది. ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అర్థం అయింది. శ్రీలంక శరణార్థల నేపథ్యంలో కథ ఉంటుందనే న్యూస్ వినిపించాయి. విజయ్ తో పాటు సత్యదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.

పాట అదిరిపోయింది. వీడియో సాంగ్ కావడం వల్ల చాలా పెద్ద ప్లస్ అయింది. సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా విజయ్ ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనే కలర్ కనిపించిందీ పాటతోనే. కావడానికి ప్రేమగీతమే అయినా.. ఆర్టిస్టుల మధ్య ఇంటెన్సిటీతో పాటు కథలోని గాఢత హైలెట్ గా కనిపించింది. ఏదో మిషన్ పై ఇద్దరూ పనిచేస్తున్నారు అనేలా ఉందీ పాట. ముఖ్యంగా వారి మధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా ఉంది. లిప్ లాక్ లు ఉన్నా.. అవి వారి సిట్యుయేషన్ కు ఎంత అవసరమో కూడా ఈ పాటలోనే తెలుస్తోంది.

మొత్తంగా కింగ్ డమ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇదే ఊపులో మరిన్ని మంచి స్టఫ్ లు రిలీజ్ చేస్తే రిలీజ్ టైమ్ కు అంచనాలు భారీగా మారతాయి. మరి ఈ హైప్ ను బ్లాక్ బస్టర్ గా మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News