రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.. సత్యదేవ్ .. విజయ్ కి అన్నగా ఓ కీలక పాత్రలో నటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు. కొన్నాళ్లుగా విజయ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో అతన్ని డీ గ్రేడ్ చేస్తూ అదే పనిగా కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ టైమ్ లో వస్తోన్న ఈ కింగ్ డమ్ తో విజయ్ బ్లాక్ బస్టర్ అందుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. పైగా ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో పార్ట్ కూడా ఉంటుందని చెబుతూ వస్తున్నాడు నాగవంశీ. అది కూడా ఈ ఫస్ట్ పార్ట్ సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది.
ఇక ఈ మూవీ ఓటిటి రైట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ కింగ్ డమ్ ఓటిటి రైట్స్ కోసం 50 కోట్లు వెచ్చిస్తోందని టాక్. 50 కోట్లు అంటే విజయ్ మూవీకి చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. అదే టైమ్ లో సితార బ్యానర్ వాల్యూ కూడా ఇందులో ఉంటుంది. కొన్నాళ్లుగా ఫ్లాపే లేకుండా దూసుకుపోతోందీ బ్యానర్. అది కూడా ఓ కారణం.
ఇక రిలీజ్ టైమ్ దగ్గరకు వస్తున్నా.. ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ కాస్త అసహనంగానే ఉన్నారు. కాస్త దూకుడు పెంచితేనే రీచ్ పెరుగుతుందని వారు భావిస్తున్నారు. బట్ సితార ప్లానింగ్ ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటుంది. అయినా మరి ఎందుకు ఇంత లేట్ అవుతుందో కానీ.. కింగ్ డమ్ కు ఓటిటి రైట్స్ ఫిగర్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.