యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన ఫస్ట్ మూవీ హీరోయిన్ రహస్య గోరక్ ను నాలుగేళ్లకు పైగా ప్రేమించి గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు పెళ్లి చేసుకునే టైమ్ కు కిరణ్ కెరీర్ లోనే బెస్ట్ హిట్ అనిపించుకున్న 'క' మూవీ పనుల్లో ఉన్నారు. అందుకే మ్యారేజ్ ను కూడా సింపుల్ గానే కానిచ్చారు. తర్వాత క మూవీ ఫంక్షన్స్ లో రహస్య మాట్లాడిన మాటలు చూసి స్వీట్ కపుల్ అనుకున్నారు చాలామంది. క బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇప్పుడు అంతకంటే బిగ్ న్యూస్ చెప్పాడు కిరణ్ అబ్బవరం. తన భార్య రహస్య గర్భంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తమ ప్రేమ మరో అడుగు ముందడుగు వేసిందని చెప్పాడు.
కిరణ్, రహస్య కలిసి రాజావారు రాణిగారు అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడే వీరు ప్రేమలో పడ్డారు. అందుకే తర్వాత రహస్య మళ్లీ నటనలోకి రాలేదు. ఇటు కిరణ్ కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. క తో తనను తాను స్ట్రాంగ్ గా నిరూపించుకున్నాడు.
ఇక ప్రస్తుతం కిరణ్ నటించిన దిల్ రుబా మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో మంచి ఇంప్రెషన్ వేసిందీ టీమ్. మరో హిట్ గ్యారెంటీ అనే టాక్ వినిపించింది. మొత్తంగా కిరణ్ మొదట స్లోగానే కనిపించినా పెళ్లి తర్వాత చాలా వేగంగా ఎదుగుతున్నాడనే చెప్పాలి.