Kiran Abbavaram : నానిని ఫాలో అవుతున్న కిరణ్ అబ్బవరం

Update: 2025-03-08 11:02 GMT

కిరణ్ అబ్బవరం.. హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. క మూవీ తర్వాత అతని గురించి ఇండస్ట్రీ కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం దిల్ రుబా అనే మూవీతో ఈ నెల 14న రాబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ మరో హిట్ కొట్టబోతున్నాడు అంటున్నారు చాలామంది. అతనూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ టైమ్ లో అతనో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.

నేచురల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగా ఆకట్టుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం కూడా అతన్ని ఫాలో అవుతున్నాడట. అంటే డైరెక్ట్ గా నానిని ఫాలో అవుతున్నా అని చెప్పలేదు కానీ.. తనూ నిర్మాతగా మారాడు. ఆల్రెడీ ఓ సినిమా రూపొందుతోందట. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం చెప్పలేదు కానీ.. అప్పుడే మనోడు నిర్మాణం మొదలుపెట్టాడు అనేది అతనే చెప్పాడు. సో.. ఓరకంగా ఇంత ఎర్లీగా ప్రొడక్షన్ అంటే చాలా డేరింగ్ స్టెప్్ అనే చెప్పాలి. ఇంకా అతను హీరోగా పూర్తిగా సెటిల్ అయ్యాడు అని చెప్పలేం. కనీసం ఓ ఏడెనిమిది హిట్స్ అయినా పడిన తర్వాత ప్రారంభించి ఉంటే బెటర్ అనే సలహాలు కూడా వస్తున్నాయి. బట్ రిస్క్ చేస్తేనే కదా ఏదైనా దక్కేది అనేది అతని అభిమతం కావొచ్చు. పైగా తన భార్య రహస్య కూడా ప్రొడక్షన్ లో అనుభవం సంపాదిస్తోంది. ‘క’మూవీ సిఇవో రహస్య నే అనేది చాలామందికి తెలియదు. సో.. ముందు ముందు ప్రొడక్షన్ బాధ్యతలు రహస్య చూసుకుంటుందేమో.

Tags:    

Similar News