Koratala Siva : దేవరలో 10 శాతమే చూపించాడట

Update: 2025-01-25 14:18 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, కలైరాసన్ కీలక పాత్రల్లో నటించిన దేవర బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా కొందరు పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేసినా సినిమాను ఆపలేకపోయారు. 2024 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ దసరా హాలిడేస్ వరకూ దుమ్మురేపింది అనే చెప్పాలి. డ్యూయొల్ రోల్ లో ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఆచార్య వంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవరతో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీ కంటెంట్ పై ఫ్యాన్స్ పూర్తి శాటిస్ఫై కాలేదు అనేది నిజం. ఇటు ఆడియన్స్ లో కూడా చాలా వరకూ అదే అభిప్రాయంతో ఉన్నారు. కొరటాల రేంజ్ రైటింగ్ సినిమాలో కనిపించలేదు అనే కంప్లైంట్స్ చాలానే వచ్చాయి. అయినా ఎన్టీఆర్ సోలోగా సినిమాను మోశాడు కాబట్టే అంత పెద్ద హిట్ అయిందన్నారు.

ఇక లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ మీడియాకు కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. దేవర లో మీరు చూసింది 10 శాతమే. దేవర 2 లో 100 శాతం చూస్తారు. ఇలాంటి విధ్వంసం ఇంతకు ముందెప్పుడూ చూడలేదు అనేలా సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పడం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాన్ని దేవర మరికాస్త ముందుకు తీసుకువెళ్లింది. కానీ ఏదో మిస్ అయిందన్న భావన ఉంది కదా..? దాన్ని పూర్తిగా మర్చిపోయేలా సెకండ్ పార్ట్ చేస్తుందని చెప్పాడు కొరటాల. దీంతో అసలు దేవరకు రెండో భాగం ఉంటుందా లేదా అనుకుంటున్నవారికీ ఓ క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ మూవీ కూడా స్టార్ట్ అయింది. అలాగే తమిళ్ నుంచి జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో దేవర 2 గురించి మాట్లాడటం అంటే కొరటాల శివకు ఎన్టీఆర్ నుంచి ఏమైనా హామీ వచ్చిందా లేక.. ఈ మూవీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనే కొరటాల మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూడాలి.

Tags:    

Similar News