Krishna Vamsi : అప్పుడు చిరు వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డా : కృష్ణవంశీ
Krishna Vamsi : కృష్ణవంశీ దర్శకత్వంలో తాజాగా వస్తున్న చిత్రం ‘‘రంగ మార్తాండ’’.;
Krishna Vamsi : కృష్ణవంశీ దర్శకత్వంలో తాజాగా వస్తున్న చిత్రం ''రంగ మార్తాండ''. మరాఠీలో తెరకెక్కిన ''నటసామ్రాట్''కు ఇది రీమేక్. మెగా స్టార్ చిరంజీవి దీనికి వాయస్ ఓవర్ ఇస్తున్నారు. రంగ మార్తాండ మూవీకి సంబంధించి జరిగిన ఇంటర్వూలో ఆయన చిరుతో తనకున్న అనుభందం గురుంచి. తన ప్రాణాలను చిరు ఎలా కాపాడారో చెప్పుకొచ్చారు. పీకల్లోతు సమస్యలున్నప్పుడు "గోవిందుడు అందరివాడేలే'' సినిమా చాన్స్ ఇచ్చి ఆదుకున్నారన్నారు.
మెగాస్టార్‌తో గతంలో కలిసి ఓ యాడ్‌కు పనిచేశారట. అప్పుడు.. ''అన్నయ్య.. మీకు ఇష్టమైనవారికి ఈ కారు గిఫ్ట్‌గా ఇవ్వండి'' అని అన్నారట.. కొన్ని రోజుల తర్వాత అదే కారు తనకు గిఫ్ట్‌గా చిరు ఇచ్చారన్నారు. వద్దని చెప్పినా.. "అన్నయ్య అంటున్నావ్.. అన్నయ్యిస్తే తీసుకోవా'' అని చిరు అన్నారట. అదే కారులో నందిగామ నుంచి వస్తుంటే భారీ యాక్సిడెంట్ జరిగింది. కారులో ఉండడం వల్ల కొన్ని గాయాలు మాత్రమే అయ్యాయని. అలా చిరు తన ప్రాణాలు కాపాడారని గుర్తుచేసుకున్నారు దర్శకుడు కృష్ణ వంశీ.