Krishnam Raju : కృష్ణంరాజు మృతికి కారణం అదే.. డాక్టర్లు ఏమన్నారంటే..
Krishnam Raju : దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతిపై ప్రకటన చేశారు AIG డాక్టర్లు;
Krishnam Raju : దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతిపై ప్రకటన చేశారు AIG డాక్టర్లు. కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్టు రావడంతో చనిపోయారని చెప్పారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉందని చెప్పారు. రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగిందన్నారు. చాలా కాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారని వెల్లడించారు.
పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5న హాస్పిటల్‌లో చేరారని డాక్టర్లు చెప్పారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్లు గుర్తించామన్నారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో హాస్పిటల్‌లో చేరిన నాటి నుంచి వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించామన్నారు. ఐతే ఇవాళ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు తీవ్రమైన గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.