Krithi Shetty : హ్యాట్రిక్ కొట్టబోతోన్న కృతిశెట్టి

Update: 2025-12-03 07:35 GMT

కృతిశెట్టి హీరోయిన్ గా మొదలు పెట్టింది ఉప్పెన మూవీతో. తెలుగులో గొప్ప క్రేజ్ కూడా వచ్చింది. బట్ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో కాస్త ఫెయిల్ అయింది. కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత కోలీవుడ్ లో అడుగులు మొదలు పెట్టింది. అందులో బ్యాడ్ లక్ గా ఆ మూవీస్ కూడా చెప్పిన టైమ్ కు రిలీజ్ కావడం లేదు అన్నారు. లేదంటే ఈ పాటికే తన తమిళ్ మూవీస్ విడుదలై ఉండేది. బట్ కాస్త లేట్ గా లేటెస్ట్ గా అన్నట్టుగా ఒకేసారి మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అది కూడా డిసెంబర్ నెలలోనే కావడం విశేషం.

ఈ నెల 12న విడుదల కాబోతోన్న మూవీ వా వాతియార్. అన్నగారు వచ్చారు అనే తెలుగు డబ్బింగ్ టైటిల్ తో కూడా విడుదల కాబోతోంది ఈ మూవీ. కార్తీ హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా చాలాకాలం క్రితమే విడుదలై ఉండాల్సింది. బట్ సడెన్ గా డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్నారు అంటూ పోస్టర్స్ వేశారు. అంటే కృతి శెట్టి తమిళ్ మూవీ విడుదల కాబోతోందన్నమాట.

కట్ చేస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీ కూడా ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ చిత్రం కూడా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. బట్ లేట్ అయింది. దీంతో వచ్చే వాలైంటేన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేస్తారు అనే ప్రచారం జరిగింది. మరి ఏం జరిగిందో సడెన్ గా ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ 18న రిలీజ్ అని చెప్పారు. ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన మూవీ ఇది. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. నిర్మాత కూడా తనే. సో.. ఈ మూవీ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక క్రిస్మస్ కు కూడా మరో విడుదల ఉంది కృతి శెట్టికి. కాకపోతే మరో ఇద్దరు హీరోయిన్లను కూడా షేర్ చేయబోతోంది. సినిమా టైటిల్ జీనీ. రవి మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కృతిశెట్టితో పాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి కూడా నటించారు. ఈ మూవీ కూడా బాగా ఆలస్యంగానే విడుదలవుతోంది. భువనేష్ అర్జునన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో మాత్రం కాస్త తేడాగా ఉంది. మొత్తంగా ఈ మూడు సినిమాలతో కృతి శెట్టి తమిళ్ లో జెండా పాతేయాలనుకుంటోంది. మరి ఈ మూడు చిత్రాలు రిలీజ్ అవడమే కాదు.. హిట్ టాక్ కూడా తెచ్చుకుంటాయా అనేది చూడాలి. 

Tags:    

Similar News