Kriti Sanon : దానిపైనే కృతి సనన్ ఆశలు

Update: 2025-05-19 09:45 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో  నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి సనన్. ఐతే ఆ మూవీ కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత తెలుగులోనే నాగ చైతన్య తో దోచెయ్ సినిమా చేసింది బ్యూటీ. అనంతరం బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంది. 'హీరోపంటీ', 'బరేలీ కి బర్ఫీ', 'దిల్వాలే' వంటి చిత్రాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు ఇలా హిందీ ఆడియన్స్ ని మెప్పిస్తూ వచ్చింది. 2021లో విడుదలైన 'మిమీ'కి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఐతే ఏమైందో ఏమో కానీ సడెన్గా ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. బాలీవుడ్ లో ము ద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ ని చూసే రెబల్ స్టార్ చేసిన ఆదిపురుష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అందులో సీత పాత్రలో కృతి సనన్ ఇంప్రెస్ చేసింది. ఐతే ఆ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో ఈఅందాల భామ మరింత ఇబ్బందుల్లో పడింది. ఆదిపురుష్ తర్వాత మరో రెండు చిత్రాలు చేసినా లాభం లేకుండా పోయింది. ఐతే లాస్ట్ ఇయర్ వచ్చిన క్రూ సినిమాతో కాస్త బెటర్ అని పించుకుంది కృతి సనన్. ప్రస్తుతం ఈఅమ్మడు తెరె ఇష్క్ మైన్ చిత్రంలో నటిస్తుంది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి బాలీవుడ్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది కృతి సనన్. అయితే ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది కృతి. మరోవైపు తప్పకుండా ఈ అమ్మడు తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News