సాయిరోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'లగ్గం. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. రమేశ్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో ఈ మూవీని తీశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్కి స్పందన బాగానే వచ్చింది. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో వస్తున్న చిత్రం లగ్గం. గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందిందనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ ట్రైలర్లోని ఎమోషనల్ అంశాలు సినిమాపై ఆసక్తిని, అంచనాలు పెంచాయి. ఈ దీపావళికి లగ్గం సినిమా సందడి చేయనుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరోహీరోయిన్లుగా నటించారు. మణిశర్మ ఈ మూవీకి సంగీతమందించారు.