హారర్ కామెడీ అనేది బాక్సాఫీస్ కు ఎప్పుడూ ఫేవరెట్ కంటెంటే. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు మాగ్జిమం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ తగ్గింది. రెగ్యులర్ మూవీస్ వస్తున్నాయి. ఈ టైమ్ లో మరోసారి హారర్ కామెడీతో అదరగొట్టబోతున్నాం అంటూ వస్తున్నారు ల్యాంప్ మూవీతో. వినోద్ నువ్వుల, మధుప్రియ జంటగా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ల్యాంప్ ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ అంతా నాన్ స్టాప్ నవ్వులతో అదరగొడుతూ.. సెకండ్ హాఫ్ లోనూ ఆ నవ్వులను కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను భయపెట్టడమే టార్గెట్ గా రూపొందిన సినిమాలా కనిపిస్తోంది.
ఒక బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో వస్తున్న సినిమాలా ఉంది ల్యాంప్. మేకింగ్ పరంగానూ కొత్తగా ఉంది. కామెడీ, హారర్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన కొందరు ఖచ్చితంగా ఈ మధ్య వస్తోన్న చిన్న సినిమాల్లో మంచి సినిమా అవుతుందని చెబుతున్నారు. ఇలాంటి మూవీస్ కొత్తేం కాకపోయినా ఓ కొత్త ఎలిమెంట్ తో వచ్చిన మూవీస్ కు ఆదరణ ఉంటుంది. అలాంటి ఎలిమెంట్స్ ఈ మూవీలోనూ ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు.
వినోద్, మధుప్రియతో పాటు కోటి కిరణ్,అవంతిక, దివంగత రాకేష్ మాస్టర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ రాజ్ తెరకెక్కించాడు. జీవిఎన్ శేఖర్ రెడ్డి నిర్మించాడు. మరి ఈ శుక్రవారం వస్తోన్న మూవీస్ లో ల్యాంప్ గ్రాంగ్ గా వెలుగుతుందా లేదా అనేది చూడాలి.