Laya: శ్రీరామనవమి స్పెషల్.. కళావతి పాటకు స్టెప్పేసిన సీనియర్ నటి..
Laya: ఒకప్పుడు లయ.. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ అలరిస్తోంది.;
Laya: మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమా 'సర్కారు వారి పాట'పై ప్రేక్షకుల్లో చాలానే అంచనాలు ఉన్నాయి. చాలారోజుల తర్వాత ఓ పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌తో తన అభిమానులను అలరించడానికి వచ్చేస్తు్న్నాడు మహేశ్. అయితే ముందుగా ఈ సినిమాలో నుండి విడుదలయిన 'కళావతి' పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందుకే ఓ సీనియర్ నటి కూడా ఇప్పుడు ఈ పాటపై స్టెప్పులేసి అందరినీ అలరించింది.
ఏదైనా ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా ఉంటే చాలు. అందుకే కళావతి పాటకు కూడా పాపులారిటీ తీసుకురావడం కళావతి స్టెప్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది మూవీ టీమ్. ఈ ఛాలెంజ్‌లో సితార, కీర్తి సురేశ్‌తో పాటు తమన్ కూడా పాల్గొని అందరినీ మెప్పించాడు. వీరు మాత్రమే కాదు పలువురు ఇన్‌స్టా్గ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా కళావతి స్టెప్‌ను పర్ఫెక్ట్‌గా చేసి చూపించారు.
సీనియర్ నటి లయ.. సినిమాల్లో కనిపించి చాలాకాలమే అయ్యింది. పైగా ఒకప్పుడు లయ.. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. తాజాగా తన స్నేహితులతో కలిసి కళావతి పాటకు స్టెప్పులేసి.. ఫాలోవర్స్‌కు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసింది లయ.