Liger Twitter Review: పక్కా మాస్ 'విజయ్ దేవరకొండ' స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్.. 'లైగర్' ట్విటర్‌ రివ్యూ

Liger Twitter Review:విజయ్ దేవరకొండ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, అతని మొదటి పాన్-ఇండియా వెంచర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్, భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది.

Update: 2022-08-25 04:27 GMT

Liger Twitter Review: విజయ్ దేవరకొండ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, అతని మొదటి పాన్-ఇండియా వెంచర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్, భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమా సంచలనం సృష్టించింది. గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది చిత్ర యూనిట్. దాంతో ప్రేక్షకుల్లో లైగర్‌పై ఒక క్రియేట్ చేసారు యూనిట్ సభ్యులు. విజయ్ ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగా, అనన్య పాండే ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్లైంది.

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఛాంపియన్‌గా ఎదగాలని ఆకాంక్షించే కరీంనగర్‌కు చెందిన ఒక సాధారణ టీ అమ్మకందారుని కథ లైగర్. తన కలను నెరవేర్చుకునేందుకు తల్లి రమ్య కృష్ణతో కలిసి ముంబై బయలుదేరుతాడు. అక్కడి నుంచే కథ మొదలవుతుంది. విజయ్, రమ్యకృష్ణ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనన్య పాండే పర్లేదనిపించింది అని ఇప్పటికే చూసిన ఆడియన్స్ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

ఇంకా ఈ చిత్రంలో చుంకీ పాండే, మకరంద్ దేశ్‌పాండే, అలీ వంటి ప్రధాన తారాగణం ఉన్నారు. లెజెండరీ బాక్సింగ్ ఐకాన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తాడు. పూరి ట్రేడ్‌మార్క్ డైలాగ్‌లు, కథనం మరియు స్క్రీన్‌ప్లేతో పాటు నటీనటుల నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

మంచి క‌మ‌ర్షియ‌ల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా లైగ‌ర్ మూవీ ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని స‌న్నివేశాలు స్లోగా ఉన్నాయ‌ని, అయితే ఎంగేజింగ్ సీన్స్ బావున్నాయని అంటున్నారు. మాస్‌కి మంచి విందులాంటి సినిమాను పూరి తెర‌కెక్కించార‌ని నెటిజ‌న్స్ అంటున్నారు.

Tags:    

Similar News