RRR Movie : జక్కన్న ఆఫర్ : RRR మూవీని మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్స్..!
RRR Movie : వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ నటించారు.. అయితే వీరికంటే ముందు చాలా మంది హీరోయిన్‌లను అనుకున్నాడట రాజమౌళి..;
RRR Movie : ఇప్పుడు ఎక్కడ చూసిన RRR మూవీ గురించే డిస్కషన్.. ఎన్టీఆర్, చరణ్ లతో మూవీని చేస్తున్నట్టుగా ఎప్పుడైతే జక్కన్న అనౌన్సు చేశాడో అప్పటినుంచి మూవీ పైన హైప్స్ క్రియేట్ అవ్వగా టీజర్, ట్రైలర్ లతో మూవీ పై అంచనాలు మరింత హైప్‌కి వెళ్ళిపోయాయి.
ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీలోని రికార్డులన్నీ బద్దలుకొట్టుకుంటూ... హౌస్‌ఫుల్ షోస్‌లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించగా, రామ్‌చరణ్ అల్లూరి సీతరామరాజుగా మెప్పించాడు.
వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ నటించారు.. అయితే వీరికంటే ముందు చాలా మంది హీరోయిన్‌లను అనుకున్నాడట రాజమౌళి.. కానీ వారు పలు కారణాల వల్ల RRR మూవీని రిజెక్ట్ చేశారట..
బాహుబలి హీరో ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సాహో మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శ్రద్ధాకపూర్.. ఆమెకు ముందుగా సీత పాత్రను ఆఫర్ చేశారు రాజమౌళి కానీ.. ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. లిస్ట్‌లో ఆమె పేరు టాప్‌లో ఉంది. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక రాజమౌళికి నో చెప్పిందట.
ఆ తరువాత పరిణితి చోప్రాను కూడా అప్రోచ్ అయ్యాడు రాజమౌళి.. కానీ ఆమె కూడా డేట్స్ అడ్జెస్ట్ కాలేక సినిమాని వదులుకుంది.ఇక ఐ మరియు రోబో 2.0లో నటించిన బ్రిటీష్ నటి అమీ జాక్సన్‌కి ముందుగా జెన్నిఫర్ రోల్‌ని ఆఫర్ చేశారట రాజమౌళి.. కానీ అప్పుడామె గర్భవతి కావడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట.
ఇక ఆ పాత్రకి ఆ తరవాత బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని తీసుకున్నారు జక్కన్న... కానీ ఆమె కొద్ది రోజులకే RRR ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కింది.