ఏ దర్శకుడైనా తన సినిమా గురించిన ఇంటర్వ్యూస్ లో మూవీకి సంబందించిన అంశాలు ఎక్కువగా మాట్లాడతాడు. అప్పుడు ఆ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి కలుగుతుంది. కొన్ని సినిమాలకు ఇది అవసరం లేదు. కారణం.. స్టార్స్. స్టార్స్ ఉంటే ఆటో మేటిక్ గా ఓపెనింగ్స్ వస్తాయి. ఇక రజినీకాంత్ లాంటి స్టార్ ఉంటే ఓపెనింగ్స్ కు కొదవ ఏముంది..? బట్ ఇప్పుడు ఆయన ఉన్న ఫామ్ కు ఓపెనింగ్స్ అవసరమే. అవి రావాలంటే ప్రమోషన్స్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆయన నటించిన కూలీ మూవీ గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే.. సినిమా గురించి కాక ఆయా హీరోల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలానే కనిపిస్తోంది. అంతే తప్ప సినిమా గురించి ఏం మాట్లాడ్డం లేదు.
కూలీ ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. రజినీకాంత్ తో పాటు విలన్ గా నాగార్జున, ఇతర పాత్రల్లో ఉపేంద్ర, సౌబిన్ షబీర్, శృతి హాసన్, సత్య రాజ్, ఆమిర్ ఖాన్ (కేమియో) లు నటించారు. చూస్తుంటే ఈ మధ్య కాలంలో జైలర్ తర్వాత అంత పెద్ద స్టార్ కాస్ట్ మూవీ ఇదే. జైలర్ విజయంలో రజినీతో పాటు ఇతర ‘స్టార్స్’ చాలా కీలకంగా కనిపించారు. కంటెంట్ పరంగా చూస్తే మరీ కొత్తది కాదు. బలమైన ఎమోషన్స్ కూడా కనిపించవు. అయినా స్టార్స్ వల్ల జైలర్ హిట్టై పోయింది. అదే మరోసారి రిపీట్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది కూలీ పరిస్థితి. అందుకే దర్శకుడు.. తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు నాగార్జున గురించి, మళయాలం వారి కోసం సౌబిర్ తో పాటు ఫహాద్ ను చేర్చి మాట్లాడుతున్నాడు. రజినీకాంత్ కంటే నాగార్జుననే టఫ్ అనేశాడు అంటే అతని కథపై అనుమానాలు రావా..?
అఫ్ కోర్స్ అతను కథను ఇంటర్వ్యూస్ లో చెప్పాలనేం లేదు. కనీసం సినిమాపై హైప్ తెచ్చే మేటర్ ఏదీ మాట్లాడ్డం లేదు. ఎంత సేపూ ఆ హీరో అలా.. ఈ హీరో ఇలా.. అంటూ నెట్టుకొస్తున్నాడు. కొన్నిసార్లు ఇలాంటి భారీ చిత్రాలు, భారీ తారాగణం ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య బాలీవుడ్ నుంచి వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ పరిస్థితి చూశాం కదా. ఏదేమైనా కేవలం ఆర్టిస్టులను పొగుడుతూ కూర్చుకుంటే ప్రమోషన్స్ అనిపించుకోవు కదా. అందుకే కాస్త కంటెంట్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది.