షార్ట్ టైమ్ లో టాప్ డైరెక్టర్ అయ్యాడు లోకేష్ కనకరాజ్. అతను చేసిన ప్రతి సినిమా విజయం సాధిస్తోంది. ముఖ్యంగా వెటరన్స్ స్టార్స్ ను ఓ రేంజ్ లో వాడేస్తున్నాడు. ప్రస్తుతం కూలీ చిత్రంతో రాబోతున్నాడు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిర్ షబిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అడిగే అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో ఆన్సర్స్ చెబుతున్నాడు లోకేష్.
తాజాగా విక్రమ్ సినిమా గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందులోని ఏజెంట్ టీనా పాత్రను ప్రస్తావించాడు. ఇదే విషయం లోకేష్ ను అడిగితే ఆ పాత్రతో ఓ పూర్తి స్థాయి వెబ్ సిరీస్ రూపొందించబోతున్నట్టు చెప్పాడు. నిజానికి ఏజెంట్ టీనా పాత్ర విక్రమ్ లో బిగ్గెస్ట్ సర్ ప్రైజ్. క్లైమాక్స్ లో సూర్యకు ఎన్ని విజిల్స్ పడ్డాయో.. ఏజెంట్ టీనా ఫైట్ టైమ్ లోనే అంతే విజిల్స్ పడ్డాయి. అలాంటి పాత్రను మరింత పవర్ ఫుల్ గా రాసుకుని వెబ్ సిరీస్ తీస్తాం అని చెప్పాడు లోకేష్. అయితే ఇప్పుడు తను ఉన్న బిజికీ తను డైరెక్ట్ చేయలేడు. అందుకే వేరే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు అని చెప్పాడు. సో.. ఏజెంట్ టీనా వెండితెరపై కాక బుల్లి తెరపై సందడి చేస్తుందన్నమాట.