ఒంటరితనం అనేది చాలా భయంకరమైనదని సమంత అన్నారు. తను మూడురోజుల పాటు మొబైల్, సోషల్ మీడియా, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా గడిపానని తెలిపారు. ఈజర్నీ తనలో ఎంతో పరివర్తన తెచ్చిందని, మానసిక ప్రశాంతత లభించిందన్నారు. మానసికంగా శక్తిమంతంగా మారాలంటే ఇటువంటి మార్గాలను ప్రయత్నించండని సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ విడాకులు తీసుకున్నారు. ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్యను శోభితను రెండో వివాహం చేసుకున్నారు.సమంత మాత్రం సింగిల్‌గానే ఉంటున్నారు.