మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో సినిమా గతేడాదే స్టార్ట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లోని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా ఈ చిత్రాన్ని చెబుతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అత్యంత కీలకమైన ఓ పాత్ర కోసం కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్ ను తీసుకున్నారు. ఆ మధ్య ఆయన క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స తీసుకుని వచ్చారు. చికిత్స తర్వాత ఎక్కువ విశ్రాంతి లేకుండానే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్నాడు శివన్న. ఆల్రెడీ కన్నడలో ఓ సినిమా స్టార్ట్ అయింది. తాజాగా రామ్ చరణ్ మూవీ కోసం లుక్ టెస్ట్ పూర్తి చేశారు.
ఈ లుక్ టెస్ట్ కోసం ఎంటైర్ జాగ్రత్తలు తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. అయితే అప్పుడే ఆయన లుక్ ను రివీల్ చేయలేదు. బుచ్చిబాబు చాలా కేర్ ఫుల్ గా ఆ లుక్ ను డిజైన్ చేయించుకున్నాడంటున్నారు. త్వరలోనే శివన్న ఈ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడని అప్డేట్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది టీమ్.
మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నీ కుదిరితే ఈ యేడాది దసరా లేదా దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.