Trisha : మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది : త్రిష

Update: 2025-04-12 07:45 GMT

దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో రాణిస్తోన్న నటి త్రిష. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల త్రిష విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సిని మాలతోనూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. త్రిష వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా సోషల్మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. 'విషపూరితమైన వ్యక్తులు.. అసలు మీరెలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఖాళీగా కూర్చొని ఇతరులను ఉద్దేశించి సోషల్మీడియాలో పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టడమేనా మీ పని? మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. మీతోపాటు జీవించే వారి విషయంలో బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు ఆశీ స్సులు మీకు ఉండాలని కోరు కుంటున్నా' అని త్రిష ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రస్తు తం ఇది నెట్టింటా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News