MAA Elections 2021: వారిద్దరూ మాట్లాడుకోవట్లేదు.. కారణం ఇదేనా..!

MAA Elections 2021: హైదరాబాద్‌లో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తోన్న అలయ్ బలయ్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది.

Update: 2021-10-17 11:31 GMT

MAA Elections 2021: హైదరాబాద్‌ జలవిహార్‌లో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబం నిర్వహిస్తోన్న అలయ్ బలయ్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ముఖాముఖి ఎదురైనా ఇద్దరు మాట్లాడుకోలేదు. పవన్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు ప్రయత్నించగా... దీన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.

మా ఎన్నికల సమయంలో మెగా కాంపౌండ్, మంచు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రకాష్‌రాజ్‌ను ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో చిరు ఫ్యామిలీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే మంచు విష్ణును ఎన్నికల బరిలోకి దింపారు మోహన్‌ బాబు. దీంతో మా ఎన్నికలు ఎన్నడూ లేనంతగా హీటెక్కాయి.

మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత కూడా వివిధ వేదికలపై రెండు వర్గాలు పరస్పరం కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత పరిణామాలతో మంచు, మెగా ఫ్యామీల మధ్య దూరం పెరిగిపోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పవన్‌ కల్యాణ్‌తో మంచు విష్ణు మాట్లాడేందుకు ప్రయత్నించడం, దీన్ని పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడంతో వీరి మధ్య గ్యాప్‌ పెరిగిపోయినట్లు స్పష్టమవుతోందంటున్నాయి సినీ వర్గాలు.

Tags:    

Similar News