MAA Elections 2021: లోకల్, నాన్ లోకల్.. అప్పుడు విశాల్, ఇప్పుడు ప్రకాశ్ రాజ్..

MAA Elections 2021: లోకల్, నాన్ లోకల్ అనే సమస్య ఎక్కడైనా ఉంది. లోకల్ వాళ్లు వారికి ఉన్న సపోర్ట్‌తో ముందుకు వెళ్లడం సహజం.

Update: 2021-10-06 09:15 GMT

MAA Elections 2021: లోకల్, నాన్ లోకల్ అనే సమస్య ఎక్కడైనా ఉంది. లోకల్ వాళ్లు వారికి ఉన్న సపోర్ట్‌తో నాన్ లోకల్ వారిని వెనక్కి తోయాలనుకోవడం కామన్. ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికలలో కూడా ఇదే వివాదాన్ని రేపే అంశంగా మారింది. పుట్టి పెరిగింది కర్ణాటక రాష్ట్రంలో అయినా తన నటనతో తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాడు ప్రకాశ్ రాజ్. తనకు పోటీగా అధ్యక్ష పోటీకి నిలబడ్డాడు మంచు విష్ణు. అందుకే విష్ణు లోకల్ అని, ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని మా సభ్యులు చాలామంది వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు.

మా ఎన్నికలలో జరుగుతన్న లోకల్, నాన్ లోకల్ గొడవ చూస్తుంటే కోలీవుడ్‌లో నడిగర్ సంఘం ఎన్నికలనే తలపిస్తోంది. తెలుగు నటీనటులకు మా లాగా తమిళ వారికి నడిగర్ సంఘం ఉంటుంది. గతంలో ఇలాగే నడిగర్ సంఘం ఎన్నికలు జరిగినప్పుడు విశాల్, రాధిక పోటీలో దిగారు. రాధిక కూడా విశాల్ తమిళ వాడు కాదని, నాన్ లోకల్ అని పలు వాఖ్యలు చేసింది. కానీ చివరికి అనూహ్యంగా విశాల్ విజయం సాధించాడు.

ఇప్పుడు కూడా ప్రకాశ్ రాజ్ లోకల్ కాదంటూ విష్ణు ప్యానెల్‌కు చెందిన నరేశ్ విమర్శించాడు. దర్శకుడు, నటుడు రవి బాబు కూడా బయటివారికి అధ్యక్ష పదవిని ఎలా ఇస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. మరి నడిగర్ సంఘం ఎన్ని్కల్లో జరిగినట్టు మా ఎన్నికలలో కూడా అంచనాలు తారుమారు అవుతాయేమో వేచి చూడాలి..

Tags:    

Similar News