అందరూ కొత్త కుర్రాళ్లు మినిమం బడ్జెట్ తో రూపొందించిన సినిమా మ్యాడ్. 2023లో విడుదలైన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓయి శ్రీ గౌరీప్రియ, అనాత్మిక గోపిక ఉదయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కంప్లీట్ యూత్ ఫుల్ కాలేజ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ డైలాగ్స్ కు యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు పడిపడి నవ్వారు. ముఖ్యంగా కాలేజ్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాం అని గతంలోనే ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ టైమ్ కు వీరి ఇంజినీరింగ్ అయిపోతుంది. ఆ తర్వాతి కథేంటీ అనేది ఈ పార్ట్ లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. అయితే హిట్ అయింది కదా అని సీక్వెల్స్ తీసినంత మాత్రాన వర్కవుట్ కావు. హిట్ మూవీ సీక్వెల్ కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తారు.. తేల్చి పడేస్తారు. అందుకే డబుల్ డోస్ కామెడీతో రావాల్సి ఉంటుంది. ఆ మేరకు హామీ ఇస్తూ.. టైటిల్ ను మ్యాడ్ మ్యాక్స్ అని పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం అనౌన్స్ చేస్తాంఅని ప్రకటించారు.
ఇక ఈ చిత్రాన్ని ఇప్పటికే మాగ్జిమం షూటింగ్ పూర్తి చేశారు. అన్నీ కుదిరితే క్రిస్మస్ బరిలో దిగాలనుకుంటున్నారట. అయితే ఆ టైమ్ కు గేమ్ ఛేంజర్ లాంటి బిగ్ మూవీస్ లేకుంటేనే వీళ్లు వస్తారు.